ఆదివారం ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. ఆయనకు తగిన శాస్తే జరిగిందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డదిడ్డంగా మాట్లాడినందుకే ప్రజలు వ్యతిరేక నినాదాలు చేశారని, ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూముల్ని రాజ్యాంగబద్దంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్…
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్డి సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో.. ప్రతి ఊరుని అభివృద్ధి చేశామని చెప్పినప్పుడు.. సభలో వ్యతిరేక నినాదాలు రేకెత్తాయి. అంతేకాదు.. తన ప్రసంగం ముగించుకొని మంత్రి వెళ్తున్న క్రమంలో వాహనంపై దాడి చేశారు. కుర్చీలు, రాళ్ళు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందుకు సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తూ.. తన నియోజకవర్గంలో రెడ్డి సభ నిర్వహించడం…