ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీనో.. సొంత వ్యాపార కార్యకలాపాల్లోనూ అంతే బిజీగా ఉంటారట. దాంతో నియోజకవర్గంలో ప్రజలకు చిక్కరు.. దొరకరనే ముద్ర పడిపోయింది. ఎవరా మంత్రి? ఆత్మకూరులో మంత్రి చిక్కరు.. దొరకరు..? మేకపాటి గౌతంరెడ్డి. ఏపీ మంత్రి. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సీఎం జగన్‌కు సన్నిహితమనే ముద్ర ఉంది. మేకపాటి కుటుంబానికి సొంత వ్యాపారాలు ఎక్కువే. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి రెండోసారి గెలిచిన గౌతంరెడ్డి తమ…