ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి ఛార్జీల భారాన్ని తగ్గించాలి. విద్యుత్ ఛార్జీల పెంచి ఆక్వా రంగాన్ని పట్టపగలు ఉరితీశారు. అత్యధిక ఆదాయాన్ని, ఉపాధి కల్పించే ఆక్వారంగంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం హయాంలో తగ్గించిన ఆక్వా విద్యుత్ ఛార్జీలను ఇప్పుడు రెట్టింపు చేశారు. ఇప్పటికే విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల…