హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైళ్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్‌లో సుమారు 20 నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తరచూ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా మెట్రో రైలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో ఇటీవల…