తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ నోట మళ్ళీ క్షమాపణలు అనే పదం వచ్చింది. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని తెలిపారు. ఎన్డీఏ సభ్యులు 164 మంది చాలా బాధ్యతతో ఉన్నారు.. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. 7 రోజుల పాటు సాగిన సమావేశాలు.. నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఎం తీరు గజ్జెల లాగు వేసుకొని కొరడాతో తనని తానే కొట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం కాబట్టి మైక్ దొరికింది అని మాట్లాడారు.. తమకు మాత్రం మైక్ ఇవ్వనివ్వలేదని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. శాసన సభ చరిత్రలో ఎప్పుడు చెప్పని విధంగా అబద్ధాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారు.. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పత్తి రైతులు ఎనిమిది నెలలు పంట పండిస్తారు.. పత్తి రైతులకు రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు.
Minister Seethakka – KTR: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రస్తుత మంత్రి సీతక్క మండి పడ్డారు. ఇందులో భాగంగా గత 10 ఏళ్లలో కేటీఆర్ ఎప్పుడైనా ఓయూకి వెళ్ళాడా.? కేటీఆర్ మాటలు.. కోట శ్రీనివాస్ రావు కోడి కథ లెక్క ఉందని ఆమె మండి పడింది. డబుల్ పించన్ మీ హయంలో తీసుకున్న వాళ్ళు కేవలం 5 వేల పై చిలుకు మాత్రమే అని., మళ్లీ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్…
MLA Danam Nagender Comments on Union Minister Nirmala Sitharaman: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. శాసన సభలో క్వశ్చన్ అవర్ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2024పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర…
Telangana Assembly Sessions 2024: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. షార్ట్ డిస్కషన్ కింద స్పీకర్ అనుమతి ఇస్తే.. కేంద్ర బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం…
ఈరోజు సాయంత్రం బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.