తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ చాలా రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే… ఇవాళ పలు కీలక బిల్లులు తెలంగాణ అసెంబ్లీ లో ఆమోదం పొందాయి. ఇందులో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021 ను.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టగా… ది తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ టౌటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశట్టారు. ఈ రెండు బిల్లులు మొదట ఆమోదం పొందగా….మంత్రి వేముల ప్రశాంత్…
గులాబ్ తుఫాన్ తెలంగాణలో విధ్వంసమే సృష్టిస్తోంది… ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుగా ప్రకటించారు సీఎం కేసీఆర్.. ఇక, అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.. భారీ వర్షాల వల్ల…
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం…
అసెంబ్లీని కేవలం ఐదు రోజుల పాటే నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్న ఆయన.. మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్నారు.. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఆయన.. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం.. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదన్నారు.. మొదటి ప్రభుత్వంలో…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది.…