Remal Cyclone : తుఫాను పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకినప్పటి నుండి, భారతదేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో చాలా చోట్ల వర్షం కొనసాగుతోంది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో వరదల పరిస్థితి ఏర్పడింది.
Assam Flood: అస్సాంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తొమ్మిది జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. అయితే వరద నీరు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం.