సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాలలో ఏషియన్ ఫిలిమ్స్ కొన్నేళ్ళుగా తన సత్తాను చాటుతోంది. అంతేకాదు, పాత సినిమా థియేటర్లను రెన్నోవేట్ చేయడం, కొత్త థియేటర్ల ను నిర్మించడం వంటి కార్యక్రమాన్ని కొంతకాలంగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఏషియన్ ఫిలిమ్స్ ప్రిన్స్ మహేశ్ బాబుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఎఎంబి’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మించింది. అలానే విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్ నగర్ లోనూ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిపి, ఇటీవల ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు…