Ravi Kumar Panasa: పిరియడ్ డ్రామాలో తిరువీర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thiruveer: ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ‘మసూద’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వైవిధ్యమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి చూపించే తిరువీర్ ఇప్పుడో పిరియడ్ డ్రామాలో ఛాన్స్ సంపాదించుకున్నాడు. సినీరంగ ప్రముఖులతోనూ, రాజకీయ నాయకులతోనూ చక్కని అనుబంధం ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త రవికుమార్ పనస… తన తొలి చిత్రాన్ని తిరువీర్ తో నిర్మించబోతున్నాడు. ఈ పిరియడ్ డ్రామాకు ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరించబోతోంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన గోపీ విహారి (జి.జి.) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత రవికుమార్ పనస మాట్లాడుతూ, ”చిత్రసీమతో ఎంతోకాలంగా ఉన్న అనుబంధం దృష్ట్యా ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాలని అనుకున్నాను. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. మేం నిర్మించబోయే పిరియడ్ డ్రామాకు తిరువీర్ బెటర్ ఛాయిస్ అనిపించింది. దర్శకుడు జి. జి. తన ఫ్రెష్ థాట్స్ తో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం ఉంది. తెలుగు సినీ ప్రేమికులకు ఈ చిత్రం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అతి త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తాం” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?