తెలంగాణ నుంచి కారులో అక్రమ మద్యం తరలిస్తూ.. ఓ ఏఎస్సై పట్టుబడ్డాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టగా.. గురజాల పట్టణ ఏఎస్సై (స్టేషన్ రైటర్) స్టాలిన్ పట్టుబడ్డాడు. స్టాలిన్ సహా తెలుగుదేశం పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, కొండలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 36…