ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పు అంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి జనరేటర్లు ఆన్‌చేశాం అంటారని… తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేశామంటున్నారని.. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కు పనికొస్తుంది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని అశోక్ గజపతిరాజు…