నకిలీ సర్టిఫికెట్ వ్యవహరంలో టీడీపీ నేత అశోక్‌బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలని నాని మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఏం తప్పు చేశారని సిగ్గులేకుండా అడుతున్నారని, చంద్రబాబు దొంగల ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందాడని, అయినా.. అశోక్‌బాబుపై కంప్లైంట్ చేసింది తన సహోద్యోగేనని ఆయన అన్నారు. ఇలా వేరొకరి రావాల్సిన పదోన్నతలు నకిలీ సర్టిఫికెట్లతో తను అనుభవించడం తప్పుకాదా…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై నిలదీస్తున్నందుకే.. ప్రభుత్వం కక్ష గట్టి అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. అసలు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని… సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ప్రతి తప్పుకు త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్‌బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్‌బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468,…