Cow Cess: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని ఒక బార్‌లో మద్యం కొనుగోలు చేసిన ఒక కస్టమర్ నుంచి ఇటీవల 20% అదనపు పన్ను వసూలు చేశారు. ఈ అదనపు పన్నును 'కౌ సెస్'గా విధించారు. వాస్తవానికి.. కౌ సెస్ అనేది రాజస్థాన్‌లోని ఆవులు, గోశాలలకు మద్దతుకు సంబంధించిన పన్ను. మద్యంపై ఈ పన్ను విధించడంతో దానికి సంబంధించిన బిల్లు కాపీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మద్యంపై కౌ సెస్ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.