Cow Cess: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని ఒక బార్‌లో మద్యం కొనుగోలు చేసిన ఒక కస్టమర్ నుంచి ఇటీవల 20% అదనపు పన్ను వసూలు చేశారు. ఈ అదనపు పన్నును ‘కౌ సెస్’గా విధించారు. వాస్తవానికి.. కౌ సెస్ అనేది రాజస్థాన్‌లోని ఆవులు, గోశాలలకు మద్దతుకు సంబంధించిన పన్ను. మద్యంపై ఈ పన్ను విధించడంతో దానికి సంబంధించిన బిల్లు కాపీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మద్యంపై కౌ సెస్ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
READ MORE: Housing Board : తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో భూముల వేలం.. ఎప్పుడంటే.?
సెప్టెంబర్ 30న జోధ్‌పూర్ పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌లో కస్టమర్ మొక్కజొన్న వడలు, ఆరు బీర్లను ఆర్డర్ చేసినట్లు బిల్లులో చూపించారు. ఆర్డర్ మొత్తం రూ. 2,650. అందులో GST, VAT, 20% కౌ సెస్ యాడ్ చేశారు. దీంతో మొత్తం నికర బిల్లు రూ. 3,262 అయ్యింది. అయితే.. ఈ మద్యంపై కౌ సెస్ ఏంటని కస్టమర్ ప్రశ్నించారు. ‘కౌ సెస్’ కొత్త పన్ను కాదని, 2018 నుంచి మద్యం అమ్మకాలపై సెస్ వసూలు చేస్తున్నామని హోటల్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ తెలిపారు.
READ MORE: Laxmi Reddy: కిరణ్ రాయల్ అంశంలో బిగ్ ట్విస్ట్.. జనసేన, వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు
వాస్తవానికి.. జూన్ 22, 2018న అప్పటి వసుంధర రాజే ప్రభుత్వం రాజస్థాన్ విలువ ఆధారిత పన్ను చట్టం, 2003 ప్రకారం డీలర్లు విక్రయించే విదేశీ మద్యం, భారత్‌లో తయారు చేసిన దేశీ, విదేశీ మద్యంపై 20% సర్‌ఛార్జ్‌ను నోటిఫై చేసింది. ఈ సుంకాన్ని గో సంరక్షణ కోసం వినియోగిస్తారు. అయితే.. రాజే పదవీకాలంలో సర్‌ఛార్జ్ 10% ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి 2018లో గో సంరక్షణ కేంద్రాలకు మద్దతు ఇవ్వడానికి, గో సంరక్షణను ప్రోత్సహించడానికి ఈ సుంకాన్ని మద్యానికి కూడా విస్తరించారు. అనంతరం.. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెస్‌ను కొనసాగించింది.