సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ బాదాడు. ఇది అతడికి 37వ టెస్ట్ సెంచరీ కాగా.. యాషెస్ సిరీస్‌లో 13వ శతకం. దాంతో ఇంగ్లాండ్ లెజెండ్ బ్యాటర్ జాక్ హాబ్స్‌ను అధిగమించి.. యాషెస్ చరిత్రలో రెండవ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో లెజెండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ (19 సెంచరీలు) మొదటి స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా (10), వాలీ హామండ్…