Asha Parekh: నాటి మేటి హిందీ నటి ఆశా పరేఖ్ కు 2020 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కమిటీలో హేమామాలిని, ఆశా భోస్లే, పూనమ్ థిల్లాన్, టి.యస్. నాగాభరణ, ఉదిత్ నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆశా పరేఖ్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ రత్నంలాగా వెలుగనుంది.