బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700…