Assam Flood: అస్సాంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తొమ్మిది జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. అయితే వరద నీరు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి శనివారం అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అస్సాంను ఉగ్రవాదం, దాడుల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.