‘సరపట్టా పరంపరై’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆర్య ఇటీవల ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. శ్రీలంకకు చెందిన మహిళ విద్జా తనను ఆర్య మోసం చేసి 70 లక్షలు దోచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఆర్యను పోలీసులు ప్రశ్నించి నిర్దోషి అని నిర్ధారించారు. చెన్నై పులియంతోప్‌కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళను ఆర్యలా నటించి మోసం చేశారని పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు వాట్సప్…