ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అరుంధతి రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు ఎందులోనూ తక్కువ…
ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈరోజు రాత్రికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వనున్నారు. వన్డే ప్రపంచకప్ 2025 సాధించిన భారత జట్టులో ఉన్న అరుంధతి రెడ్డకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు అరుంధతి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు. అరుంధతి రెడ్డి ప్రస్తుతం భారత మహిళా జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో అరుంధతికి ఒక్క…