Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఆ రాష్ట్రానికి శుభవార్త అందింది. దీని వల్ల జమ్మూ కాశ్మీర్‌లో నివసించే ప్రజల జీవితాలు మారవచ్చు.
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ, కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.