PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సమయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంపై కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులు ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసిందని గుర్తుచేశారు.