Home
Arnab Cyclone
Arnab Cyclone News
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
53 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ‘అర్నబ్’ తుఫాన్ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 2026, అక్టోబర్ 28, 2026 తేదీల్లో అంటే రెండు రోజుల పాటు నడవాల్సిన మొత్తం 53 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ కోస్టల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలపై… -
Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి హైఅలర్ట్ ప్రకటించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అమరావతిలోని విపత్తుల నిర్వహణ విభాగం, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను గమనం, తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. తీరప్రాంత ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని… -
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
Arnab Cyclone Alert: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.. దీంతో, ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేస్తోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు… -
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ వైపు అర్నబ్ తుఫాన దూసుకొస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అవుతోంది.. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటుంది.. మరోవైపు.. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలను ముమ్మరం చేసి, పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అంతర్వేది బీచ్ వద్ద బారికేడ్లు… -
Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది.. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం వర్చువల్‌గా సమీక్షించారు. రేపటి కల్లా తీవ్ర తుఫానుగా మారి ఇది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికల రీత్యా ఆయా తీరప్రాంత జిల్లాల… -
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఆర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది.. తుఫాన్ అతి తీవ్రంగా విరుచుకుపడుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావానికి అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుఫాన్… -
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం వేగంగా కదులుతున్న ఈ తుపాన్ ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలపడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎల్లుండి ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల… -
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు దూసుకొస్తుంది.. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.. అందులో భాగంగా.. రేపు, ఎల్లుండి అంటే మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్, విశాఖ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించారు.. ప్రజలు… -
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతానికి ‘అర్నాబ్’ తుఫాన్ పెను ముప్పుగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుఫాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌గా బలపడుతూ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.… -
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
Cyclone Arnab Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం దక్షిణ దిశగా కదులుతూ.. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత మరింత బలపడి…
తాజావార్తలు
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
-
Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
-
Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
-
CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!