Home
Arnab Cyclone
Arnab Cyclone News
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టాన్ని మిగిలిచ్చింది.. అయితే, అర్నబ్ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. తుఫాన్ పరిస్థితులు, ప్రభావిత జిల్లాల్లో జరిగిన నష్టం, ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు, అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు… -
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి గంటగంటకూ సమీక్ష నిర్వహించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రాణనష్టం నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి స్వర్ణ గ్రామం స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఇదే బాధ్యతతో పనిచేయాలని సూచించామని తెలిపారు. చివరి బాధితుడికి కూడా… -
Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సహాయక చర్యలు, ప్రజల భద్రత, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం… -
Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి అధికారులతో పరిస్థితులను సమీక్షించారు. కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలవారీగా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షిస్తున్నట్లు… -
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
Arnab Cyclone Damages: ఆంధ్రప్రదేశ్‌ను అర్నబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది.. అర్నబ్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, మౌలిక వసతులకు నష్టం వాటిల్లిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తుఫాన్ కారణంగా మొత్తం 126.165 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక నష్టం తుఫాన్ ప్రభావంతో జిల్లాల వారీగా రహదారులకు జరిగిన నష్టాన్ని… -
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న 'అర్నబ్' తుఫాను తీవ్రత శాటిలైట్ చిత్రాల్లో భయానకంగా కనపడుతోంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తాకిన అర్నబ్ తుఫాను తీరందాటేసింది. ఈ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచగా.. కొన్ని చోట్ల గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవడానికి మన దేశానికి చెందిన 'ఇన్సాట్-3డీఎస్' వాతావరణ ఉపగ్రహం కొన్ని చిత్రాలను పంచుకుంది.… -
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
6000 Power Poles Down in Konaseema: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ధాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయం కావడం.. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్… -
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
CM Chandrababu letter to Amit Shah: అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరితగతిన పంపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా… -
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
Cyclone Arnab Landfall Complete: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. యానాం–నరసాపురం మధ్య, కోనసీమ ప్రాంతానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యానాంకు నైరుతి దిశలో, నరసాపురానికి దగ్గరగా తీరాన్ని దాటిన అర్నబ్ తుఫాన్ పూర్తిగా భూమిపైకి చేరింది. ఈ క్రమంలో అతి తీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదని అధికారులు పేర్కొన్నారు. రానున్న ఆరు నుంచి ఏడు… -
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
Cyclone Arnab Effect at Uppada: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం అతలాకుతలమైంది. తీరప్రాంత గ్రామాలపై రాకాసి అలలు విరుచుకుపడటంతో పలుచోట్ల ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు బలమైన ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సముద్రపు అలల ధాటికి రక్షణ గోడలు ధ్వంసం కాగా.. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు.…
తాజావార్తలు
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
-
Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
-
Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
-
CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!