Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతానికి ‘అర్నాబ్’ తుఫాన్ పెను ముప్పుగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుఫాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌గా బలపడుతూ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 11 గంటల సమయంలో అతితీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అధికారులు పేరొన్నారు.
అర్నాబ్ తుఫాన్ తీరం దాటడానికి ఆరు గంటల ముందు గాలుల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, సముద్రం అల్లకల్లోలంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. తుఫాన్ తీరం దాటే సమయంలో కోనసీమ, కాకినాడ జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఎగసిపడటంతో సుమారు 2.5 మీటర్ల ఎత్తున ఉప్పెన సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు లోపలికి చొచ్చుకువచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
- AP Local Elections 2026: జెడ్పీ స్థానాలపై కూటమిలో ఉత్కంఠ.. మరో రెండు కావాలంటూ జనసేన డిమాండ్!
- Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం..
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫ్లడ్ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో పాటు కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు, నదుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం.. నార్త్ బ్లాక్‌కు 6 ఫైర్ ఇంజిన్లు!
-
AP Local Elections 2026: జెడ్పీ స్థానాలపై కూటమిలో ఉత్కంఠ.. మరో రెండు కావాలంటూ జనసేన డిమాండ్!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!