Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జిల్లాలోని పిలుఖేడిలోని ఎన్‌హెచ్ 46లోని ఓస్వాల్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదం జరిగింది.
పూంచ్‌లో ఆర్మీ వాహనంపై దాడి ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన 6 మంది వ్యక్తుల ప్రమేయం ఉందని, అందులో ఒకరి కుటుంబం మొత్తం కుట్రలో భాగమేనని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల ఉక్కు బుల్లెట్లను ఉపయోగించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అటవీ ప్రాంతంలో సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.