గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు. రాత్రికిరాత్రే రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే…