అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తుంటే మరోవైపు ఆయన కూతురు అల్లు అర్హ కూడా రికార్డులు బ్రేక్ చేసే చేసే పనిలో పడింది. అల్లు అర్హ క్యూట్ లుక్స్ కు ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’తో సినిమా ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధం లేకుండా అల్లు అర్హ టాలెంట్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.…