సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ కి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దర్శనానికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెళ్లారు.