మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అనిల్ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు చరణ్ దంపతులు. ఆ సందర్భముగా మోడీని కలిసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి…