మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అనిల్ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు చరణ్ దంపతులు. ఆ సందర్భముగా మోడీని కలిసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి మెగా దంపతులు శ్రీకారం చుట్టారు. విలువిద్య క్రీడలో ఇంకా చాలా మంది చేరాలని చరణ్ – ఉపాసన దంపతులు యువతని ప్రోత్సహించారు.
ఈ నేపథ్యంలో చరణ్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ ఎక్స్ ఖాతాలో ‘ రామ్ చరణ్, ఉపాసన,అనిల్ కామినేనిని కలవడం ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని అభినందిస్తూ ట్వీట్ చేసారు.
ఉపాసనగారిని,అనిల్ కామినేనిగారిని కలవడం ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది.@AlwaysRamCharan @upasanakonidela https://t.co/Al8aYCvy3w
— Narendra Modi (@narendramodi) October 12, 2025