Sambhal Mosque: గతేడాది నవంబర్‌లో ఘర్షణకు కేరాఫ్‌గా మారిన ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాష్ ‘‘షాహీ జామా మసీదు’’ మరోసారి వార్తల్లో నిలిచింది. రంజాన్‌కి ముందు మసీదుని పునరుద్ధరించడానికి జామా మసీదు యాజమాన్యం ఏఎస్ఐ అనుమతిని కోరింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, సంభాల్ జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదులో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్‌శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
Gyanvapi Case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే సంచలనంగా మారింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ రిపోర్టును బహిరంగపరచడం జరిగింది. ఇప్పటికే రెండు వర్గాలకు ఈ రిపోర్టు అందింది. నిన్న హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ రిపోర్టులోని అంశాలను మీడియాకు వెళ్లడిస్తూ.. అక్కడి మసీదుకు పూర్వం పెద్ద హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తుందని వెల్లడించారు.
Gyanvapi-Kashi Vishwanath Temple: జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును బహిరంగపరచాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక హార్డ్ కాపీలను ఇరు వర్గాలతో పంచుకోవాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. డిసెంబర్ 19న ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు…