ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఎన్డీఏ బలపరిచిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కురుపాం నియోజకవర్గం గుమ్మలక్షిపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాలలో పర్యటించిన కొత్తపల్లి గీతకు.. స్థానిక ప్రజలు సంప్రదాయ గిరిజన వాయిద్యాలత, థింసా నృత్యాలతో మహిళలు హారతులతో స్వాగతం పలుకగా గిరిజనులతో కలిసి థింసా నృత్యంలో కొత్తపల్లి గీత అడుగులు కలిపారు.