ఒక పాట హిట్టయితే, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? ఈ ప్రశ్న ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఏఆర్ రెహమాన్. కొంతకాలంగా పూర్తిస్థాయి మ్యూజికల్ హిట్ ఆల్బమ్ ఇవ్వడంలో తడబడుతున్న రెహమాన్‌పై, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ద నమ్మకమే ఉంచారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్‌కు తెలుగులో ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు.…