నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు. కాగా.. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.