ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రభుత్వం సమ్మెకి దిగే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చూస్తుంటే… ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీడీవోలు, ట్రెజరీ అధికారుల ద్వారా కొత్త జీతాల ప్రక్రియ చేపట్టింది. అయితే తమ ఉద్యమం ఆగదని, పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
ఏపీలో పీఆర్సీపీ ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిగిపింది. ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. అయితే నిన్న కూడా సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే నేడు సీఎం జగన్ మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామన్నారు.…