తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. రాష్ట్రంలోని గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై హైకోర్టు మధ్యంతర తీర్పును సవాలు చేసిన కేసులో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేయకుండా నిరాకరించింది.
Yadadri temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో విధులు నిర్వహించే డోలు వాయిద్యకారుడు వెంకటసుబ్బయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ వాయిద్యకారుల పోస్టుల నియామకాల బోర్డు మెంబర్ గా ఉన్న వెంకటసుబ్బయ్య సస్పెన్షన్ సంచలనంగా మారింది.
తెలంగాణ ఆర్టీసీ కారుణ్య నియామకాలకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జారీ చేశారు. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు కొన్నేళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే డ్యూటీ చేస్తు గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబాలనికి ముందుగా కొలువులివ్వాలని నిర్ణయించింది. గ్రేడ్ 2 డ్రైవర్ పోస్టుకు రూ. 19,000లు, కండక్టర్ గ్రేడ్ 2 పోస్టుకు రూ.17,000లు, ఆర్టీసీ కానిస్టేబుల్…