తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జూన్ 17వ తేదీన సిఐడి ముందు హాజరవుతానని బీజేపీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్ప జూన్ 15 శనివారం తెలిపారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ సీఎం బెంగళూరులో అన్నారు. పోక్సో కేసుకు సంబంధించి యడ్యూరప్పను అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు శుక్రవారం సీఐడీని నిలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట జూన్ 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్…