Maoists: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు.