నటుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డాడని అందులో వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో తేజ్ కు చికిత్స అందిస్తున్నామని, ప్రధాన అవయవాలన్నీ బాగానే ఉన్నాయని, వాటి పని తీరు కూడా బాగుందని, ఈరోజు అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ ఇస్తామని,…