HDFC APK File Scam: సైబర్ నేరగాళ్లు ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్స్‌తో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. వీటి సహాయంతో స్మార్ట్‌ఫోన్లను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని డబ్బును దోచేస్తున్నారు. అయితే, ఈ తరహా ఫైల్స్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా హెచ్చరించింది.