కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దేశంలో సెక్యులరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే అని, రాష్ర్టాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. రాష్ర్ట రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని, రెండు రాజధానులు అనేది అవకాశవాధమని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ ఒప్పుకొనే రాష్ర్ట రాజధాని మొదలుపెట్టారని ఆయన వెల్లడించారు. శ్రీబాగ్ ఒడంబడిక…