ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాం అన్నారు. సీఎం జగన్ ప్యాలెస్సులో కూర్చుంటే పాలన సాగదు. నాటుసారా…