ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం…
టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి…
గత ఎన్నికలలోల్లో రైతులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టకున్నారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పినదానికంటే అధికంగా ఇచ్చారన్నారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశాం అని ఆయన తెలిపారు. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాణి చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే…
Mudragada Padmanabham Writes Letter to Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిందని.. ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి మీరే కారకులు అని, ప్రజలు మిమ్మల్ని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ.. విజయవాడ ఆంధ్ర భవన్లో దరఖాస్తులను స్వీకరిచింది. నేటితో కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన ముగియనుంది. Also Read: Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ.. బుధవారం…
Kurnool MP Seat: కర్నూలు ఎంపీ అభ్యర్థిపై ఈరోజు వైసీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కర్నూలు మేయర్ బీవై రామయ్యను ఇప్పటికే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధిష్టానం పిలిపించింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పేరును ఇప్పటికే ఖరారు చేసింది. మంత్రి జయరాంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయన నిరాకరించడంతో బీవై రామయ్య పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్‌ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన…
ఏపీ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలకు ఎక్కడా విలువ లేదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారు.. తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. ఎస్సీ వర్గీకరణకు ఎవరు మద్దతిస్తే వారికి ఎమ్మార్పీఎస్ తరఫున ఆ పార్టీకి మద్దతిస్తాని తెలిపారు.
అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీన మల్లిఖార్జున ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్ లతో కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ పార్టీలు నాశనం చేశాయని దుయ్యబట్టారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదాలాంటి అంశాలు తమ మేనిఫెస్టోలో ఉంటాయని తెలిపారు. కాగా.. ఇండియా కూటమితో కలిసి వచ్చే అందరితో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న…
2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్ధిక గణాంకాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. రాబడులు- వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక ఇచ్చింది.