ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. వరద సహాయ కార్యక్రమాలకు సీఎం వెంటనే నిధులు ఇచ్చి ఆదుకున్నారని కునాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గురించి సీఎం జగన్కు కేంద్ర బృందం వివరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది. కేంద్ర బృందం తరపున కునాల్ సత్యార్థి జగన్కు వివరాలు వెల్లడించారు.…
అల్ప పీడన ప్రభావంతో కడప జిల్లాలో భారీగా కురుస్తున్నవర్షాలకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. వర్షం ధాటికి కడప నగరంలోని అనేక ప్రాంతాలు మళ్ళీ జలమయమయ్యాయి. కడప కార్పొరేషన్ పరిధిలోని ఎన్జీవో కాలనీ, బాలాజీ నగర్, ఆర్టీసీ బస్టాండ్, అప్సరా సర్కిల్, శంకరాపురం, కోఆప్ రేటివ్ కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష ప్రభావం రెండు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనలతో ముందస్తుగా జిల్లావిద్యాశాఖ సోమవారం అన్ని…
పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష భేటీలో టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు సూచించారు. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు కోరినట్టు తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించలేదని చెప్పామన్నారు. దీనిపై ఏకీకృత నిబంధనలు తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని…
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే…
అసెంబ్లీలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపు పని అని టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీపై విమర్శలు బాణాలు వదిలిన ఆయన.. కౌరవ సభను మళ్ళీ గౌరవ సభగా మారుస్తామన్నారు. చంద్రబాబు కంటతడి జీవితంలో చూడబోమని అనుకున్నాం కానీ వైసీపీ నేతలు దిగజారి చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర…
విపత్తును కూడా రాజకీయ చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికై వరదల సాయంపై ఆయా అధికారులతో మాట్లాడి బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ‘మడమ తిప్పను మాట తప్పను అన్నారు. ఇప్పుడు మడమ తిప్పుతూ మాట తప్పుతున్నారు. గిరా గిరా తిరుగుతూ ఎక్కడో పడిపోతావ్’ అని చంద్రబాబు అంటున్నారని జగన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జగన్ నేనే గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని…
సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్ఎంబీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు రెండు రాష్ర్టాల జనవనరుల కార్యదర్శులకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. సాగు,తాగు అవసరాలకు లేకుండా ఇష్టారీతిన విద్యుదుత్పత్తిని చేశారని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. సముద్రంలోకి 55.96 టీఎంసీలు వృథాగా పోతున్నాయని వెల్లడించింది. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్ఎంబీ తెలిపింది. ఇప్పటికైనా విద్యుదుత్పత్తి ని వెంటనే నిలపి…
అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరి సాగు చేయొద్దంటు ఆదేశాలు ఇవ్వడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలు తాగితేనే సంక్షేమ పథకాలు అనే పరిస్థితి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు. రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీఎంబర్స్మెంట్ అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగినా పట్టించుకోకుండా.. సినిమా టికెట్లు అమ్మడం ప్రభుత్వ సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు. 15వ ఆర్థిక…
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. “ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద…
కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. ఆర్టీపీపీలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 13, 6 యూనిట్లలో కలిపి 600 మెగావాట్లు…