అక్టోబరు 2 తేదీన వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు..