రాష్ట్రంలో విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో 45 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషేంట్లు ఉన్నారు అని Dh శ్రీనివాస్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సుల్లో వస్తున్న వాళ్ళు హై ఇన్ఫెక్షన్ లో ఉన్నారు. ఇక్కడ బెడ్ లేక.. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎస్ ముందే అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు..…
బోర్డర్లో అంబులెన్స్ లను నిలిపివేయడం వల్ల జరుగుతున్న మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. చెక్ పోస్టుల వద్ద పడిగాపులు కాచి ఈరోజు అంబులెన్స్ లో ఇద్దరు రోగులు చనిపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ హై కోర్ట్ చెప్పినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకుండా కనీసం మానవత్వం చూపించడం లేదు అని విమర్శించారు. అయితే తెలంగాణలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది…