టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సోమవారం నాడు అన్ని జిల్లాల కేంద్రాల్లో టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వెల్లడిచారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫించనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. దాచుకున్న డబ్బును కూడా తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు చేయకుండా పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శలు చేశారు.…
Face Recognisation App: సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ పేరుతో ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల్లోని పలువురు టీచర్లు సిద్ధం అవుతున్నారు. అయితే టీచర్ల హాజరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వారిని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆందోళనల్లో పాల్గొనే టీచర్లను గుర్తు పట్టే ప్రయత్నాల్లో నిఘా వర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.…