ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలు, విజయవాడ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. లోక్ సభలో దీనినే ప్రధాన అంశంగా ప్రస్తావించారు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఏపీ రాష్ట్రానికి