Minister Anagani: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతల మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కొందరు చరిత్ర హీనులు ఉంటారు.. వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజర్చుకోలేను అని సెటైర్ వేశారు.
బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు.
విజయనగరం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుకోలేదని.. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తోందన్నారు..